భారీగా రేషన్ బియ్యం సీజ్
దిశ ప్రతినిధి, ఖమ్మం: అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాళ్లోకి వెళితే.. ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శిబందం ప్రాంతానికి చెందిన సీహెచ్. కృష్ణ, రాము అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని రెండు ఆటోల్లో తరలిస్తున్నట్టు పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటస్వామి, ఎస్సై రఘు తమ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బియ్యంతో పాటు […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాళ్లోకి వెళితే.. ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శిబందం ప్రాంతానికి చెందిన సీహెచ్. కృష్ణ, రాము అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని రెండు ఆటోల్లో తరలిస్తున్నట్టు పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటస్వామి, ఎస్సై రఘు తమ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బియ్యంతో పాటు తరలిస్తున్న ఆటోను సీజ్ చేసినట్టు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్టు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామన్నపేటలో శ్రీరాముల సామ్రాజ్యం అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ వుంచిన 18 క్వింటాల రేషన్ బియ్యాన్ని గుర్తించిన టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్, ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు.