లాక్‌డౌన్ ఇంకా కఠినంగా అమలు చేద్దాం: కరోనా టాస్క్‌ఫోర్స్ మంత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చెయ్యాలని కరోనా టాస్క్ ఫోర్స్ మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అదనపు సీఎస్ పీవీ రమేష్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అమరావతి రీజియన్‌లోని తాడేపల్లిలో సమావేశమైన సందర్భంగా కరోనా వ్యాప్తి నియంత్రణపై సమగ్రంగా చర్చించారు. ఈ నేపథ్యంలో కురసాల కన్నబాబు […]

Update: 2020-03-28 08:04 GMT

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చెయ్యాలని కరోనా టాస్క్ ఫోర్స్ మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అదనపు సీఎస్ పీవీ రమేష్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అమరావతి రీజియన్‌లోని తాడేపల్లిలో సమావేశమైన సందర్భంగా కరోనా వ్యాప్తి నియంత్రణపై సమగ్రంగా చర్చించారు.

ఈ నేపథ్యంలో కురసాల కన్నబాబు మాట్లాడుతూ, జనసమూహం పెరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రజలు పూర్తి నియంత్రణలో ఉన్నారన్నారు. ఉదయం 9 గంటల తరువాత ప్రజలను పోలీసులు బయటకు రానివ్వడం లేదని తెలిపారు. రైతుబజార్‌, మాల్స్‌ వద్ద జనసమూహం పెరుగకుండా నియంత్రిణ చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రజల నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిరాశ్రయులకు భోజన వసతి కల్పించాలని నిర్ణయించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అలాగే గ్రామాల్లో వ్యవసాయపనులకు ఆటంకం లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై కూడా మాట్లాడుకున్నామని ఆయన చెప్పారు. పౌరసరఫరాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించామని, అయితే నేటి సాయంత్రం మరోసారి సమావేశమై మరిన్ని అంశాలపై చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News