పంద్రాగస్టు నాటికి 5కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో పంద్రాగస్టు నాటికి ఐదు కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది. గురువారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ అర్బన్ ఫారెస్ట్రి, ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నతాధికారులతో హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అర్బన్ ఫారెస్ట్రి యంత్రాంగం నిర్వహించిన పనులు, వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కల […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో పంద్రాగస్టు నాటికి ఐదు కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించింది. గురువారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ అర్బన్ ఫారెస్ట్రి, ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నతాధికారులతో హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అర్బన్ ఫారెస్ట్రి యంత్రాంగం నిర్వహించిన పనులు, వివిధ ప్రాంతాల్లో నాటిన మొక్కల వివరాలు, వాటి గణాంకాలను కమిషనర్ అర్వింద్ కుమార్ సమీక్షించారు. హరితహారం కార్యక్రమం కింద హెచ్ఎండిఏకు ఈ ఏడాది ఐదు కోట్ల మొక్కల పెంపకం లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటికీ యాభై శాతం కూడా పూర్తి చేయకపోవడంపై కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు.
ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రాంతాలన్నీ ‘గ్రీన్ వాల్స్’ మాదిరిగా ఉండేట్లు ఇప్పటివరకు ఉన్న చెట్ల మధ్య స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పలురకాల సైజుల మొక్కలు నాటాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రజా ప్రతినిధులు, కమిషనర్ల సహకారంతో ట్రీ పార్కులు, యాదాద్రి మోడల్ ప్లాంటేషన్లు, స్మృతివనాలలో లక్ష్యసాధనలో భాగంగా మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. హరితహారం లక్ష్యాలను అధిగమించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్(హెచ్‌జిసిఎల్) పరిధిలో గ్రీనరీ బాధ్యతలను అర్బన్ ఫారెస్ట్రీ నుంచి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సంతోష్‌కు అప్పగించారు. ఓయూలో ప్లాంటేషన్ పురోగతిపై కమిషనర్అధికారుల నుంచి వివరణ కోరారు. యాదాద్రి మోడల్ (మియావాకి పద్దతి)లో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు వర్సిటీ పరిధిలో చిట్టడవులను తీసుకువస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరు నాటికి అర్బన్ ఫారెస్ట్రీ విభాగం 2.5 కోట్ల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు నిర్వహించాలని కమిషనర్ అర్వింద్ కుమార్ సూచించారు.