మున్సిపల్ భూముల కోసం మొరపెట్టుకున్న కౌన్సిలర్లు
దిశ, తాండూరు: తాండూరు పట్టణంలోని మున్సిపల్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ, మున్సిపల్ ఇన్‌చార్జీ కమిషనర్ అశోక్ కుమార్‌తో కౌన్సిలర్లు మొరపెట్టుకున్నారు. బుధవారం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు.. ఇన్‌చార్జీ కమిషనర్ అశోక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని సర్వేనెంబర్ 52లో విలువైన భూములు ఉన్నాయని, వాటిని సర్వే చేయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. సదరు సర్వేనెంబర్‌లో సర్వే చేయించి మున్సిపల్ భూములను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ […]
దిశ, తాండూరు: తాండూరు పట్టణంలోని మున్సిపల్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ, మున్సిపల్ ఇన్‌చార్జీ కమిషనర్ అశోక్ కుమార్‌తో కౌన్సిలర్లు మొరపెట్టుకున్నారు. బుధవారం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు.. ఇన్‌చార్జీ కమిషనర్ అశోక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని సర్వేనెంబర్ 52లో విలువైన భూములు ఉన్నాయని, వాటిని సర్వే చేయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. సదరు సర్వేనెంబర్‌లో సర్వే చేయించి మున్సిపల్ భూములను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింహులు, సీనియర్ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, అబ్దుల్ రజాక్, ప్రవీణ్ గౌడ్, బోయరవి, రాము, అస్లాం, బీజేపీ కౌన్సిలర్లు అంతారం లలిత, సాహు శ్రీలత, సంగీత ఠాకూర్, బంటారం లావణ్య, బాలప్ప, కాంగ్రెస్ కౌన్సిలర్ మధుబాల తదితరులు పాల్గొన్నారు.