అవినీతిమయ ప్రభుత్వాలపై ఉద్యమించాలి : తమ్మినేని పిలుపు
దిశ, హుజూర్‌నగర్: అవినీతిమయంగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో ప్రారంభమైన సీపీఎం రెండవ జిల్లా మహసభలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగం పెరిగిపోయిదని ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, విశాఖ స్టీల్ […]
దిశ, హుజూర్‌నగర్: అవినీతిమయంగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో ప్రారంభమైన సీపీఎం రెండవ జిల్లా మహసభలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగం పెరిగిపోయిదని ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, విశాఖ స్టీల్ కంపెనీ, సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాలను ప్రైవేట్ కంపనీలకు అమ్మేందుకు చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.