కేరళ ఎఫెక్ట్.. అప్రమత్తమైన తమిళనాడు
దిశ, వెబ్‌డెస్క్ : కేరళ రాష్ట్రంలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి తీవ్రత నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. కేరళ నుంచి తమిళనాడులోనికి వచ్చే వాహనాలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయి.కోళ్లు, బాతులు, పక్షుల రవాణా వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. అంతేకాకుండా సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను అధికారులు ముందస్తుగా శానిటైజ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు తమిళనాడులో బర్డ్ ప్లూ కేసులు నమోదు కాలేదు. ప్రజలు ఎవరూ […]
దిశ, వెబ్‌డెస్క్ : కేరళ రాష్ట్రంలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి తీవ్రత నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. కేరళ నుంచి తమిళనాడులోనికి వచ్చే వాహనాలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయి.కోళ్లు, బాతులు, పక్షుల రవాణా వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు.
అంతేకాకుండా సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను అధికారులు ముందస్తుగా శానిటైజ్ చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు తమిళనాడులో బర్డ్ ప్లూ కేసులు నమోదు కాలేదు. ప్రజలు ఎవరూ కూడా ఈ వ్యాధి పట్ల ఆందోళన చెందవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.