స్టార్ హీరోకు బీజేపీ వార్నింగ్.. నీ సినిమాల సంగతి మాత్రం చూసుకో

దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో అందరికి వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరికి అనిపించిన భావాలను వారు చెప్పుకోవచ్చు. అది మంచి విషయాలైన, చెడ్డ విషయాలైనా. కానీ.. ఈ పద్ధతి బీజేపీలో మాత్రం వర్తించదు అని తెలుస్తోంది. వారి మాటకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా.. వారు ఏదో రాజ ద్రోహం చేసినట్లు వారి మీద కేసులు పెట్టడం, బెదిరించడం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి బీజేపీ తమ అధికార అహంకారాన్ని చూపించింది. ఇక ఈసారి ఆ […]

Update: 2021-07-05 02:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: మన దేశంలో అందరికి వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరికి అనిపించిన భావాలను వారు చెప్పుకోవచ్చు. అది మంచి విషయాలైన, చెడ్డ విషయాలైనా. కానీ.. ఈ పద్ధతి బీజేపీలో మాత్రం వర్తించదు అని తెలుస్తోంది. వారి మాటకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా.. వారు ఏదో రాజ ద్రోహం చేసినట్లు వారి మీద కేసులు పెట్టడం, బెదిరించడం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి బీజేపీ తమ అధికార అహంకారాన్ని చూపించింది. ఇక ఈసారి ఆ బెదిరింపులు ఒక స్టార్ హీరోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

వివరాలలోకి వెళితే.. కేంద్ర ప్ర‌భుత్వం సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయంపై సినీ పరిశ్రమ పెద్ద‌లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లు తన భావాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల తమిళ్ హీరో సూర్య కూడా తన బాధను వ్యక్తపరిచారు. ఈ సవరణ కేవలం భావ ప్రకటన స్వేఛ్ఛను హరించడమేనని, స్వేఛ్చ కోసం పోరాటాలు చేయాలి కానీ, దాని నాశనం చేయడానికి చట్టాలు ఏంటని సూర్య ప్రశ్నించారు. ఇక సూర్య వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దీనిపై తమిళనాడు బీజేపీ విభాగం మండిప‌డుతూ సూర్య‌కు హెచ్చ‌రిక చేసింది.

సూర్య తన సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తే బావుంటుందని, ఇలా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని బెదిరించింది. అంతేకాకుండా ఇంత చెప్పిన తర్వాత కూడా సూర్య త‌న తీరును మార్చుకోక‌పోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బీజేపీ యువజన విభాగం నేత‌లు చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి.

Tags:    

Similar News