మహేష్-సందీప్ యాడ్‌లో జాయిన్ అయిన మిల్కీ బ్యూటీ

దిశ,వెబ్ డెస్క్: టాలీవుడ్ సెలెబ్రెటీల్లో వాణిజ్య ప్రకటనల్లో ఎక్కువగా కనిపించే హీరో మహేష్ బాబు. ఒక పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో మహేష్ డైరీ ఎప్పుడూ నిండి ఉంటుందనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. ఇక ఈ సినిమాతో పాటు మహేష్ ఒక యాడ్ షూట్ లో పాల్గొననున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో […]

Update: 2021-03-16 02:25 GMT

దిశ,వెబ్ డెస్క్: టాలీవుడ్ సెలెబ్రెటీల్లో వాణిజ్య ప్రకటనల్లో ఎక్కువగా కనిపించే హీరో మహేష్ బాబు. ఒక పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో మహేష్ డైరీ ఎప్పుడూ నిండి ఉంటుందనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. ఇక ఈ సినిమాతో పాటు మహేష్ ఒక యాడ్ షూట్ లో పాల్గొననున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ యాడ్ షూట్ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రముఖ ఎలక్ట్రికల్ లైట్స్ బ్రాండ్ హావెల్స్ కోసం వీరిద్దరూ ఒకటి అయ్యారు. ఇక ఈ యాడ్ ఫిల్మ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కనిపించనుంది. నేటి నుండి ఈ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఒక్క రోజు జరగబోయే ఈ యాడ్ షూట్ ని పూర్తిచేసి.. మహేష్ మళ్ళీ ‘సర్కారువారి పాట’ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు. మరి ఈ యాడ్ లో కూడా సందీప్ తన క్రియేటివిటీ ని బయటపెడతాడేమో చూడాలి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..