సూపర్ ఎనర్జీతో వచ్చేస్తా: మిల్కీ బ్యూటీ

దిశ, వెబ్ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా డేంజర్ జోన్ నుంచి బయటపడింది. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లో పాల్గొన్న తమ్ము.. కరోనా బారిన పడగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని క్యూర్ అయింది. దాదాపు 15 రోజుల తర్వాత క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తమన్నా..తల్లిదండ్రులను చూసి చాలా ఎమోషనల్ అయింది. View this post on Instagram It's time to take baby steps and get back my […]

Update: 2020-10-16 03:54 GMT

దిశ, వెబ్ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా డేంజర్ జోన్ నుంచి బయటపడింది. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లో పాల్గొన్న తమ్ము.. కరోనా బారిన పడగా హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుని క్యూర్ అయింది. దాదాపు 15 రోజుల తర్వాత క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తమన్నా..తల్లిదండ్రులను చూసి చాలా ఎమోషనల్ అయింది.

మళ్లీ షూటింగ్‌లో పాల్గొనేందుకు, సత్తా చాటేందుకు సమాయత్తం అవుతుంది. అమ్మ ఆధ్వర్యంలో డైట్ ఫాలో అవుతున్న తమన్నా..ఇప్పుడు తన సమక్షంలోనే వర్క్ ఔట్ కూడా చేస్తుంది. ఫిట్‌నెస్ అండ్ స్టామినా కోసం ట్రై చేస్తున్నట్లు చెప్పింది. కరోనా నుంచి రికవరీ అయ్యాక చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఇదే అని చెప్తుంది. నెమ్మదిగా, స్థిరంగా ప్రయత్నిస్తూ..సూపర్ ఎనర్జీ‌తో వచ్చేస్తాను అంటూ ఫస్ట్ డే వర్క్ ఔట్ వీడియో షేర్ చేసింది. దీనిపై స్పందించిన తమన్నా ఫ్యాన్స్..మునుపెన్నడూ లేని విధంగా అమేజింగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుతూ..ఆల్ ది బెస్ట్ చెప్పారు. నీలోని బెస్ట్ ఇస్తూ బెస్ట్ మూవీస్ చేయాలని కోరారు. తమన్నా ప్రస్తుతం గోపీ చంద్ హీరోగా వస్తున్న సీటీమార్‌లో కబడ్డీ కోచ్ గా కనిపించనుండగా..బాలీవుడ్ ఫిల్మ్ అంధాధున్ రీమేక్‌లో నెగెటివ్ రోల్ ప్లే చేస్తుంది.

Tags:    

Similar News