మాల్‌లో ‘టాకింగ్ క్రిస్మస్ ట్రీ’

దిశ, ఫీచర్స్ : డిసెంబర్‌ నెల మొదలైందంటే చాలు నగరాల్లో ఎక్కడ చూసినా క్రిస్మస్‌ ట్రీ, కలర్‌ఫుల్ స్టార్స్‌తో పాటు క్రిస్మస్‌ తాతలు కూడా దర్శనమిస్తారు. సిటీల్లోని ఏ షాపింగ్‌ మాల్‌కు వెళ్లినా క్రిస్మస్‌ ఫెస్టివల్ అలంకరణలే అందరినీ ఆకర్షిస్తుంటాయి. ఆకాశాన్ని తాకేలా ఎత్తయిన క్రిస్మస్‌ ట్రీ ఏర్పాటుచేసి బొమ్మలు, చాక్లెట్స్‌, గిఫ్ట్స్, స్టార్ట్స్, లైట్స్ వంటి రకరకాల మెటీరియల్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఈ నేపథ్యంలోనే  కెనడాలోని ఒక మాల్ 15 ఏళ్లుగా ‘మాట్లాడే క్రిస్మస్ చెట్టు’ను […]

Update: 2021-12-08 09:13 GMT

దిశ, ఫీచర్స్ : డిసెంబర్‌ నెల మొదలైందంటే చాలు నగరాల్లో ఎక్కడ చూసినా క్రిస్మస్‌ ట్రీ, కలర్‌ఫుల్ స్టార్స్‌తో పాటు క్రిస్మస్‌ తాతలు కూడా దర్శనమిస్తారు. సిటీల్లోని ఏ షాపింగ్‌ మాల్‌కు వెళ్లినా క్రిస్మస్‌ ఫెస్టివల్ అలంకరణలే అందరినీ ఆకర్షిస్తుంటాయి. ఆకాశాన్ని తాకేలా ఎత్తయిన క్రిస్మస్‌ ట్రీ ఏర్పాటుచేసి బొమ్మలు, చాక్లెట్స్‌, గిఫ్ట్స్, స్టార్ట్స్, లైట్స్ వంటి రకరకాల మెటీరియల్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఈ నేపథ్యంలోనే కెనడాలోని ఒక మాల్ 15 ఏళ్లుగా ‘మాట్లాడే క్రిస్మస్ చెట్టు’ను ప్రతిష్టిస్తోంది. ప్రతి ఏటా సందర్శకులను అమితంగా ఆకట్టుకునే ఈ టాకింగ్ ‘క్రిస్మస్ ట్రీ’ని మరోసారి తమ కస్టమర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది మాల్ యాజమాన్యం.

నోవా స్కోటియాలోని ‘మైక్ మాక్’ మాల్‌లో ఏర్పాటు చేసిన 56 అడుగుల ‘క్రిస్మస్ టాకింగ్ ట్రీ’.. డిసెంబర్ 23 వరకు ప్రదర్శనలో ఉంటుంది. కస్టమర్స్‌తో స్నేహపూర్వకంగా మాట్లాడే ఈ చెట్టుకు ఓ ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంది. పదిహేనేళ్లుగా ఆ చెట్టుతో తమకున్న జ్ఞాపకాలను కస్టమర్లు ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. కాగా ఈ చెట్టుతో మాట్లాడేందుకు ఎంతోమంది మాల్‌కు వస్తుంటారని యాజమాన్యం పేర్కొంది.

ఇక కొందరు కస్టమర్లు @వుడీ క్రిస్మస్ చెట్టుతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురవుతున్నారు. తమ పిల్లలకు కూడా ఆ చెట్టును పరిచయం చేయడంతో పాటు దాంతో తమకున్న అనుబంధాన్ని వారికి వివరిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News