ఇటలీ – పంజాబ్.. రెండు గ్రామాల క్వారంటైన్ కథ
దిశ, వెబ్ డెస్క్: మన పంజాబ్, ఇటలీల మధ్య వేల మైళ్ళ దూరం ఉన్నది. కానీ రెండు గ్రామాలు ఈ రెంటినీ దగ్గర చేస్తున్నాయి. కపూర్తలాలోని ఫిరోజ్ సంఘవాల్.. ఇటలీలోని బోర్గో సాన్ గియాకోమోల మధ్య దగ్గర సంబంధం ఉంది. ఫిరోజ్ సంఘవాల్ గ్రామస్తులకు బోర్గోలో నివసించినా స్వగ్రామంలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రామం నుంచి బోర్గోలో సుమారు 200 మంది ఒకే చోట ఒక కుటుంబంలాగే నివసిస్తున్నారు. అందుకే వీరు ఉన్న ప్రాంతాన్ని.. అదే […]
దిశ, వెబ్ డెస్క్: మన పంజాబ్, ఇటలీల మధ్య వేల మైళ్ళ దూరం ఉన్నది. కానీ రెండు గ్రామాలు ఈ రెంటినీ దగ్గర చేస్తున్నాయి. కపూర్తలాలోని ఫిరోజ్ సంఘవాల్.. ఇటలీలోని బోర్గో సాన్ గియాకోమోల మధ్య దగ్గర సంబంధం ఉంది. ఫిరోజ్ సంఘవాల్ గ్రామస్తులకు బోర్గోలో నివసించినా స్వగ్రామంలో ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రామం నుంచి బోర్గోలో సుమారు 200 మంది ఒకే చోట ఒక కుటుంబంలాగే నివసిస్తున్నారు. అందుకే వీరు ఉన్న ప్రాంతాన్ని.. అదే బోర్గోను ‘మినీ ఫిరోజ్ సంఘవాల్’ అంటారు.
రెండు దశాబ్దాల క్రితం ఇటలీ మాకు విదేశం కానీ ఇప్పుడు బోర్గో మాకు సొంతూరులాంటిదేనని బోర్గోలో నివసిస్తున్న బల్బీర్ సింగ్ అన్నాడు. వారు నివసిస్తున్న ప్రావిన్స్ లో సుమారు రెండు వేల మంది పంజాబీలు ఉన్నట్టు అక్కడే ఉంటున్న మన్ ప్రీత్ తెలిపారు. కానీ, ఇప్పుడు ఈ రెండు గ్రామాలకు ఒక కామన్ సమస్య వచ్చి పడింది. అదే కరోనా. ఇటలీలో కరోనా కుదిపేసిన లంబార్డీ రీజియన్ లోనే ఈ బోర్గో ఉన్నది.
బోర్గోలో దాదాపు 70 కరుణ కేసులు నమోదైనట్టు తెలిసింది. కానీ అదృష్టవశాత్తు అందులో ఒక్క పంజాబీ కూడా లేడని మన్ ప్రీత్ చెప్పాడు. పంజాబ్ లోని 38 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ రెండు గ్రామాలు స్వీయ నిర్బంధంలో ఉన్నాయి. అందుకే ఈ రెండు గ్రామాల ప్రజలు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండి కూడా తమ బంధువుల బాగోగుల కోసం తలపిస్తున్నారు. వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ పంజాబీలందరూ ఒక చోట ఒక గ్రామాన్ని తలపించేలా కలిసి ఉండడం బోర్గో ప్రత్యేకత. అందుకే ఇటలీలో ఏమైనా పంజాబ్ లోని ఫిరోజ్ సంఘ వాల్ లో కదలికలు కనిపిస్తాయి. పంజాబ్ లో ఏ ఆపద వచ్చినా బోర్గోలో ప్రకంపనాలు వస్తాయి.