తాజ్ హోటల్స్‌కు ఉగ్ర బెదిరింపులు

ముంబయి: మహారాష్ట్ర ముంబయిలోని రెండు తాజ్ హోటళ్లకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొలాబలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, బాంద్రాలోని తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్‌ సిబ్బందికి సోమవారం రాత్రి పాకిస్తాన్ నుంచి లష్కరే తాయిబా ఉగ్రవాదుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు సమాచారం. 2008 ముంబయి ఉగ్రదాడి తరహాలోనే ఈ హోటళ్లను ధ్వంసం చేయనున్నట్టు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి కూపీలాగుతున్నారు. కాగా, ఉగ్ర బెదిరింపుల నేపథ్యంలో ఈ రెండు […]

Update: 2020-06-30 11:38 GMT

ముంబయి: మహారాష్ట్ర ముంబయిలోని రెండు తాజ్ హోటళ్లకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొలాబలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, బాంద్రాలోని తాజ్ లాండ్స్ ఎండ్ హోటల్‌ సిబ్బందికి సోమవారం రాత్రి పాకిస్తాన్ నుంచి లష్కరే తాయిబా ఉగ్రవాదుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు సమాచారం. 2008 ముంబయి ఉగ్రదాడి తరహాలోనే ఈ హోటళ్లను ధ్వంసం చేయనున్నట్టు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి కూపీలాగుతున్నారు. కాగా, ఉగ్ర బెదిరింపుల నేపథ్యంలో ఈ రెండు హోటళ్ల దగ్గర భద్రతా బలగాలు మోహరించాయి.

Tags:    

Similar News