రోజుకో యాపిల్ ఉన్నా.. వైద్యులు అవసరమే!
డాక్టర్స్ డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు వైద్యులను ప్రశంసిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన బాలీవుడ్ సెలబ్రిటీ తహిరా కశ్యప్ స్పెషల్ పోస్ట్ పెట్టింది. అసలు ఇంతకు ముందు డాక్టర్స్ డే ఉంటుందో లేదో కూడా తెలియదన్న తహిరా.. తనకు కలిగిన అనారోగ్య సమస్యలు వైద్యుల విలువను తెలుసుకునేలా చేశాయని చెప్పింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో డాక్టర్లు, నర్సులతో కలిసి దిగిన ఫొటోను […]
డాక్టర్స్ డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు వైద్యులను ప్రశంసిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన బాలీవుడ్ సెలబ్రిటీ తహిరా కశ్యప్ స్పెషల్ పోస్ట్ పెట్టింది.
అసలు ఇంతకు ముందు డాక్టర్స్ డే ఉంటుందో లేదో కూడా తెలియదన్న తహిరా.. తనకు కలిగిన అనారోగ్య సమస్యలు వైద్యుల విలువను తెలుసుకునేలా చేశాయని చెప్పింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో డాక్టర్లు, నర్సులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. 2019 జనవరి 5న తీసిన ఆ ఫొటోను.. తన 12వ, చివరి కీమోథెరపీ చేసిన రోజున తీసుకున్న ఫొటో అని వివరించింది. తనకు మళ్లీ పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించిన వారికి ఆరోజు చాకొలెట్స్ అందించి థ్యాంక్స్ చెప్పానంది. ఇప్పుడు కూడా మరో చాకొలెట్ బాక్స్ ఇవ్వాలని ఉన్నా కరోనా పరిస్థితుల్లో వెళ్లే చాన్స్ లేదని చెప్పింది.
https://www.instagram.com/p/CCFpdGLntHE/?utm_source=ig_web_copy_link
రోజుకో యాపిల్.. డాక్టర్‌ను దూరంగా ఉంచుతుందని పెద్దలు చెప్తుంటారు. కానీ తన దగ్గర ఎన్ని ఆపిల్స్ ఉన్నా డాక్టర్స్‌ను మాత్రం దూరం పెట్టనని చెప్తోంది తహీరా.