వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. తొలి పర్యటనలోనే అలా..
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని దళిత రైతుల సెగ తగిలింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించేందుకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న రాజధాని దళిత రైతులు ఆమె పర్యటనను అడ్డుకునేందుకు రెడీ అయ్యారు. సీడ్ ఆక్సిస్ రోడ్, మంతెన ఆరోగ్య ఆశ్రమం వద్ద మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం ఏర్పడి […]
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి రాజధాని దళిత రైతుల సెగ తగిలింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించేందుకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న రాజధాని దళిత రైతులు ఆమె పర్యటనను అడ్డుకునేందుకు రెడీ అయ్యారు. సీడ్ ఆక్సిస్ రోడ్, మంతెన ఆరోగ్య ఆశ్రమం వద్ద మోహరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా.. అసైన్డ్ రైతులకు కౌలు, ఫించన్ రూ.5 వేలు, టీడ్‌కో గృహాలు కేటాయించకుండా గ్రామాల్లోకి ఎలా వస్తారంటూ రాజధాని దళిత రైతులు నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఏం సాధించారని రాజధాని గ్రామల్లో పర్యటిస్తారంటూ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.