బ్రేకింగ్ న్యూస్.. తబ్లిగీ జమాత్ పై నిషేధం
దిశ, వెబ్ డెస్క్: కరోనా పుకార్లను ఒక సామాజిక వర్గానికి అంటగట్టి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ చేశారు. తర్వాత పరిణామాలు మారి క్రమేణ గొడవ సద్దుమనిగింది. అయితే జమాత్ అనేది కొత్తగా చేసేది కాదు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఉన్నదే. ప్రపంచంలోనే అతి పెద్ద జమాత్ పాకిస్తాన్ లో జరుగుతుంది. తర్వాత స్థానంలో బాంగ్లాదేశ్ ఉంది. అయితే మన దేశంలో కూడా ఏడాదికి ఒక సారి ఢిల్లీలో ఈ జమాత్ జరుగుతుంది. ప్రపంచం లో సున్నీ ఇస్లాం […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా పుకార్లను ఒక సామాజిక వర్గానికి అంటగట్టి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ చేశారు. తర్వాత పరిణామాలు మారి క్రమేణ గొడవ సద్దుమనిగింది. అయితే జమాత్ అనేది కొత్తగా చేసేది కాదు. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఉన్నదే. ప్రపంచంలోనే అతి పెద్ద జమాత్ పాకిస్తాన్ లో జరుగుతుంది. తర్వాత స్థానంలో బాంగ్లాదేశ్ ఉంది. అయితే మన దేశంలో కూడా ఏడాదికి ఒక సారి ఢిల్లీలో ఈ జమాత్ జరుగుతుంది. ప్రపంచం లో సున్నీ ఇస్లాం ను పెంచడానికి మొదలైన ఉద్యమమే ఈ తబ్లిగీ జమాత్.
ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల మంది ముస్లిం లు తబ్లిగీని ఫాలో అవుతున్నారు. 1926 లో మొదలైన ఈ సంస్థ అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. అయితే మొదట్లో విలువలతో నడిచిన ఈ సంస్థను క్రమేణా ఉగ్రవాదం వైపు నడిపించారనే అపవాదులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పట్టుబడిన చాలా మంది ఉగ్రవాదులలో తబ్లిగీలు కూడా ఉన్నారు. అయితే తబ్లిగీ కార్యకలాపాల వల్ల తమ సమాజానికి ముప్పు ఉందని భావించిన సౌదీ అరేబియా, ఆ సంస్థను తన దేశంలో బ్యాన్ చేసింది. తబ్లిగీ పై విధించిన నిషేదాన్ని తప్పక పాటించాలని సౌదీ లోని అన్ని మసీదులకు తెలిపారు.
నిజానికి ఇస్లాం ను అనుసరించే వాళ్లలో చాలా తేడాలు ఉన్నాయి. సున్నీలు, షియాలు, తబ్లిగీలు, అహ్మదీయులు, మహమ్మదీయులు. అయితే ఇప్పుడు సౌదీ లాంటి ఇస్లాం దేశం తబ్లిగీను బ్యాన్ చేయడం తో ప్రపంచ దేశాలు ఆలోచనలో పడ్డాయి. మన దేశంలో రెండేళ్ల క్రితం ఢిల్లీ లో జరిగిన సమావేశం మూలంగానే కరోనా వ్యాప్తి జరిగింది అనే తప్పుడు వాదన ప్రచారం అయిన విషయం తెలిసిందే. అయితే అక్రమంగా కొంత మంది దేశంలోకి వచ్చిన మాట వాస్తవమే. వారిపై అప్పుడే కేంద్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. సౌది లాంటి ఇస్లాం దేశం తబ్లిగీ ను నిషేధించడం పై మన దేశంలో కూడా గుసగుసలు మొదలయ్యాయి.