హా.. మేము వలసదారులం : తాప్సీ వీడియో

‘కొన్ని చిత్రాలు మన మైండ్‌ను విడిచిపెట్టలేవు.. కొన్ని మాటలు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.. ఓ వైపు ఈ కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తుండగా.. మరోవైపు వలస కూలీల బతుకు చిత్రం మనసును తొలిచేస్తోందని’ తెలిపింది హీరోయిన్ తాప్సీ. కూలీల ఆవేదన, ఆరాటం, కష్టాలు హృదయాన్ని బద్దలు చేశాయని తెలుపుతూ.. సొంత గూటికి చేరే క్రమంలో వారు పడిన కష్టాన్ని వీడియో రూపంలో మన ముందుంచింది. ఇతర దేశాల నుంచి ధనవంతులను విమానాల్లో భారతదేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వం.. […]

Update: 2020-06-12 04:05 GMT

‘కొన్ని చిత్రాలు మన మైండ్‌ను విడిచిపెట్టలేవు.. కొన్ని మాటలు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.. ఓ వైపు ఈ కరోనా మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తుండగా.. మరోవైపు వలస కూలీల బతుకు చిత్రం మనసును తొలిచేస్తోందని’ తెలిపింది హీరోయిన్ తాప్సీ. కూలీల ఆవేదన, ఆరాటం, కష్టాలు హృదయాన్ని బద్దలు చేశాయని తెలుపుతూ.. సొంత గూటికి చేరే క్రమంలో వారు పడిన కష్టాన్ని వీడియో రూపంలో మన ముందుంచింది. ఇతర దేశాల నుంచి ధనవంతులను విమానాల్లో భారతదేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వం.. వలస కార్మికులు కష్టాలు కళ్లారా చూసి కూడా స్పందించకపోవడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వీడియోలో మైగ్రెంట్ వర్కర్స్ బాధలను వివరించింది తాప్సీ.

‘అవును.. మేము వలసదారులం.. ఈ దేశ వాసులం ఎలా అవుతాం ? ఆకలైతే ఖాకీల చేతిలో దెబ్బలు తింటాం. ఆకలి, దప్పికలతో నిత్యం బాధపడుతూనే ఉంటాం. రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్న క్రమంలో మాపై ఎలాంటి కెమికల్స్ చల్లినా సరే భరిస్తాం.. కానీ సొంత గూటికి చేరాలన్న కోరికను మాత్రం చంపుకోం. బస్సుల్లో, రైళ్లల్లో, కాలినడకన.. ఇలా దారిని వెతుక్కుంటూ వెళుతున్నాం. ఒక్కోసారి దారి మరిచి ప్రాణాలు కోల్పోతున్నాం. ఇక్కడ విగ్రహాలకున్న విలువ.. మా బతుకులకు లేదు. కానీ ఆత్మగౌరవంతో బతకాలి అనుకుంటున్నాం. కానీ మేము ఎప్పటికీ వలసదారులమే.. ఈ దేశానికి చెందినవారమా? చెప్పండి’ అంటున్న వీడియో ప్రతీ ఒక్కరినీ కదిలిస్తూ ప్రశంసలు అందుకుంది. తోటి మనుషులను మనుషుల్లా అంగీకరించడం లేదన్న వాస్తవాన్ని తెలుపుతున్న ఈ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags:    

Similar News