BJP: నేడు బీజేపీ మండలాల అధ్యక్షుల ప్రకటన !
బీజేపీ(BJP) సంస్థాగత నిర్మాణ(Organizational Structure) ప్రక్రియలో భాగంగా నేడు మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికలపై కీలక ప్రకటన చేయనుంది. తెలంగాణ బీజేపీ ఇంచార్జి సునీల్ బన్సల్(In-Charge Sunil Bansal)నేడు రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మండలాల పార్టీ అధ్యక్షులకు సంబంధించి ప్రకటన చేయనున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ(BJP) సంస్థాగత నిర్మాణ(Organizational Structure) ప్రక్రియలో భాగంగా నేడు మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికలపై కీలక ప్రకటన చేయనుంది. తెలంగాణ బీజేపీ ఇంచార్జి సునీల్ బన్సల్(In-Charge Sunil Bansal)నేడు రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మండలాల పార్టీ అధ్యక్షులకు సంబంధించి ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే మండలాల పార్టీ అధ్యక్షుల ఎన్నికలు పూర్తవ్వగా..జాబితా రాష్ట్ర నాయకత్వానికి చేరింది.
అధ్యక్ష పదవికి బహుముఖ పోటీ ఉన్న చోట రెండు మూడు పేర్లను పంపగా వాటిన్నింటిని పరిశీలించి..పార్టీ నేతలతో చర్చించి మండల పార్టీ నూతన అధ్యక్షుల పేర్లను బన్సల్ ప్రకటిస్తారు. ఈ నెల 18న జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసి..ఈ నెల చివరి నాటికి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను సైతం పూర్తి చేయనున్నారు. బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుల పేర్లను కూడా ప్రకటించినందునా జిల్లా అధ్యక్షుల ఎన్నికపై కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుగనున్న సమావేశంలో బన్సల్ రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చిస్తారు.
ఈ భేటీకి జిల్లా రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్లు హాజరవుతారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారి పేర్లతో ఇప్పటికే జాబితా సిద్ధం చేశారు. 80శాతం వరకు జిల్లా అధ్యక్షుల ఖరారు అనధికారింగా జరిగినప్పటికి మిగతా వాటిపై ఏకాభిప్రాయానికి కసరత్తు జరుగనుంది. నేడు బన్సల్ నిర్వహించనున్న సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ కార్యాలయంపై దాడి ఘటన అంశాలపై కూడా చర్చించనున్నారు.