పాక్ జలసంధిని ఈదిన తెలంగాణ మహిళ

దిశ, స్పోర్ట్స్ : ఇండియా, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని ఈది హైదరాబాద్‌కు చెందిన గోలి శ్యామల (47) రికార్డు సృష్టించింది. 30 కిలోమీటర్ల పొడవైన ఈ జల సంధిని ఈదిన రెండవ మహిళగా, మొత్తానికి 13వ వ్యక్తిగా రికార్డు సృష్టించింది. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోటి వరకు ఆమె ఏకధాటిగా ఈదింది. ఇండియ, శ్రీలంక ప్రజల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు ఈ మార్గాన్ని శ్యామల ఎంచుకున్నట్లు ఆమె తెలిపారు. గత ఏడాది సౌత్ […]

Update: 2021-03-19 08:47 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇండియా, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని ఈది హైదరాబాద్‌కు చెందిన గోలి శ్యామల (47) రికార్డు సృష్టించింది. 30 కిలోమీటర్ల పొడవైన ఈ జల సంధిని ఈదిన రెండవ మహిళగా, మొత్తానికి 13వ వ్యక్తిగా రికార్డు సృష్టించింది. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోటి వరకు ఆమె ఏకధాటిగా ఈదింది. ఇండియ, శ్రీలంక ప్రజల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు ఈ మార్గాన్ని శ్యామల ఎంచుకున్నట్లు ఆమె తెలిపారు. గత ఏడాది సౌత్ కొరియాలోని గ్వాంజూ‌లో జరిగిన ఫినా వరల్డ్ మాస్టర్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. గత ఏడాది నవంబర్‌లో పట్నా సమీపంలోని గంగానదిలో 30 కిలోమీటర్లను 110 నిమిషాల్లో ఈదారు. గచ్చిబౌలిలోని శాట్స్ స్విమ్మింగ్ పూల్‌లో ఆయుష్ యాదవ్ పర్యవేక్షణలో పాక్ జలసంధిని ఈదడానికి శిక్షణ పొందారు.

Tags:    

Similar News