హైదరాబాదీలకు అలర్ట్.. Swiggy డెలివరీ బాయ్స్ స్ట్రైక్..!
దిశ, వెబ్‌డెస్క్ : బిజీ లైఫ్‌లో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్‌కు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఫుడ్ ఆర్డర్ విషయంలో స్విగ్గీ, మరికొన్ని సంస్థలు ఎంతో ఫేమస్. అయితే హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్స్ సమ్మెకు సిద్ధమయ్యారు. ఆర్డర్ డెలివరీలో భాగంగా మినిమమ్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లపై యాజమన్యం స్పందించాలని వారం రోజులు గడువు విధించారు. డిమాండ్లు తీర్చని పక్షంలో తాము సమ్మెకు రెడీ ఉన్నామంటూ హెచ్చరికలు […]
దిశ, వెబ్‌డెస్క్ : బిజీ లైఫ్‌లో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్స్‌కు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఫుడ్ ఆర్డర్ విషయంలో స్విగ్గీ, మరికొన్ని సంస్థలు ఎంతో ఫేమస్. అయితే హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్స్ సమ్మెకు సిద్ధమయ్యారు. ఆర్డర్ డెలివరీలో భాగంగా మినిమమ్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లపై యాజమన్యం స్పందించాలని వారం రోజులు గడువు విధించారు. డిమాండ్లు తీర్చని పక్షంలో తాము సమ్మెకు రెడీ ఉన్నామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10వేల మందికి పైగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ విధులు నిర్వహిస్తున్నారు. యాజమాన్యం ఒకవేళ డెలివరీ బాయ్స్ డిమాండ్లకు ఒప్పుకోకపోతే హైదరాబాద్ నగరవాసులకు కష్టాలు తప్పవు. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.