“టీ సెల్స్‌”తో కరోనా నివారణ

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలకు స్వీడన్ సైంటిస్టులు తీపి కబురు అందించారు. కరోనా మహమ్మారిని ఎలా ఎదిరించి నిలవాలో కనుగొన్నారు. కొవిడ్-19 వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అమెరికా లాంటి సంపన్న దేశం కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో సైతం వైరస్ విస్తృతంగా విస్తరిస్తూ.. వైద్యులకు సవాల్ విసురుతోంది. ఈ వైరస్ నివారణకు వివిధ దేశాలు నడుం బిగించాయి. వాక్సిన్ తయారీకి రాత్రింబవళ్లు కష్టపడుతూ తీవ్రంగా కృషి […]

Update: 2020-07-01 10:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలకు స్వీడన్ సైంటిస్టులు తీపి కబురు అందించారు. కరోనా మహమ్మారిని ఎలా ఎదిరించి నిలవాలో కనుగొన్నారు. కొవిడ్-19 వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అమెరికా లాంటి సంపన్న దేశం కూడా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో సైతం వైరస్ విస్తృతంగా విస్తరిస్తూ.. వైద్యులకు సవాల్ విసురుతోంది. ఈ వైరస్ నివారణకు వివిధ దేశాలు నడుం బిగించాయి. వాక్సిన్ తయారీకి రాత్రింబవళ్లు కష్టపడుతూ తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

కోవిడ్ 19 వైరస్‌ను ఎదుర్కొగల రోగనిరోధక శక్తి మానవుల్లో రెండితల మందిలో ఉన్నదని కరోలిన్‌స్కా పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. మానవ శరీరంలోని టీ సెల్స్‌ను పరిశీలించడం ద్వారా రుజువైందని వారు వెల్లడించారు. మానవ శరీరం వ్యాధికి వ్యతిరేకంగా పోరాడుతుందని, దీని వల్ల కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నవారిలో రోగనిరోధక శక్తి మొదట ఉన్నదానికంటే రెండు రెట్లు అధికంగా ఉండవచ్చని వివరిస్తున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచే తెల్లరక్త కణాల సమూహన్ని “టీ సెల్స్‌” గా పిలుస్తారు. కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న రోగుల్లో ఆరోగ్యంగా ఉన్న30 శాతం మందిలోని టీ సెల్స్‌ రోగ నిరోధక శక్తి పెరిగిందని నిపుణుల బృందం పేర్కొంది. ఆ 30 శాతం మందిలో కరోనా రోగ లక్షణాలు కూడా కనిపించలేదని వారు చెప్పారు. కరోనా బారిన పడిన చిన్నపిల్లలు కోలుకోవడానికి టీ–సెల్స్‌ ఎంతగానో ఉపయోగపడ్డాయని, పిల్లల్లో అవి క్రియాశీలకంగా ఉంటాయని వైద్యులు వివరించారు. కరోనాను కట్టడి చేసేందుకు ఎంత శక్తి కావాలన్నది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది.

Tags:    

Similar News