వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్సీలుగా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో వైసీపీ తరపున ఎన్నికైన సభ్యులు చిన్న గోవిందరెడ్డి, ఇషాక్ బాషా, పాలవలస విక్రాంత్ వర్మలు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే. మొత్తం ఇప్పటి వరకు శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు 18 […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్సీలుగా మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో వైసీపీ తరపున ఎన్నికైన సభ్యులు చిన్న గోవిందరెడ్డి, ఇషాక్ బాషా, పాలవలస విక్రాంత్ వర్మలు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న సంగతి తెలిసిందే. మొత్తం ఇప్పటి వరకు శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు 18 మంది ఉన్నారు.
అయితే తాజాగా ఈ ముగ్గురు ఎమ్మెల్సీలతో కలిపి ఆ సంఖ్య 21కు చేరింది. ఈ నెలాఖరులోగా మరో 11 మంది వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ 11 స్థానాలను కూడా వైసీపీ తన ఖాతాలోనే వేసుకోనుంది. దీంతో శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య 32 కు చేరుకుంటుంది. దీంతో మండలిలోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగించనుంది.