ఇంకోసారి రిపీట్ కావొద్దు.. టీఆర్ఎస్కు ‘స్వేరో’స్ వార్నింగ్
దిశ, నాగర్ కర్నూల్: ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశ్యంతో డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారని.. త్వరలో ప్రజల్లోకి వచ్చి భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తారని స్వేరో నెట్వర్క్ సీనియర్ రిసోర్స్ పర్సన్ ముకురాల శ్రీహరి అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్.ఎస్ ప్రవీణ్ పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారంగానే భావిస్తున్నామని.. తక్షణమే ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలని టీఆర్ఎస్ అధిష్టానాన్ని హెచ్చరించారు. […]
దిశ, నాగర్ కర్నూల్: ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశ్యంతో డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారని.. త్వరలో ప్రజల్లోకి వచ్చి భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తారని స్వేరో నెట్వర్క్ సీనియర్ రిసోర్స్ పర్సన్ ముకురాల శ్రీహరి అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్.ఎస్ ప్రవీణ్ పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారంగానే భావిస్తున్నామని.. తక్షణమే ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలని టీఆర్ఎస్ అధిష్టానాన్ని హెచ్చరించారు. బహుజన ప్రజలందరూ ఎలాంటి గందరగోళానికి గురి కావొద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజల ముందుకొచ్చి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని.. అప్పటివరకు స్వేరో నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను చైతన్య పరచాలని పిలుపునిచ్చారు.