సుజనా చౌదరి, కామినేని, నిమ్మగడ్డ రహస్య భేటీ !
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయం మరోసారి హీటెక్కింది. తనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని కోరుతున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ కావడం చర్చనీయాంశం అయ్యింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాతో పాటు పలు ఛానళ్లలో ప్రసారం అవుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఎస్ఈసీగా కొనసాగించాలని హైకోర్టుకు వెళ్లిన కామినేని శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితో […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయం మరోసారి హీటెక్కింది. తనను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని కోరుతున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ కావడం చర్చనీయాంశం అయ్యింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాతో పాటు పలు ఛానళ్లలో ప్రసారం అవుతుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఎస్ఈసీగా కొనసాగించాలని హైకోర్టుకు వెళ్లిన కామినేని శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితో భేటీ కావడం రాజకీయంగా దుమారం రేపుతోంది.
చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన కామినేని, టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై బీజేపీలో చేరిన సుజనా చౌదరి ఒకే హోటల్‌లోని రూమ్‌కు వేర్వేరుగా వెళ్లి దాదాపు 2గంటల పాటు సమావేశమై తిరిగి బయటకు వస్తోన్న సీసీ ఫుటేజ్ ఇప్పుడు వైసీపీకి అస్త్రంగా మారింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చంద్రబాబు మనిషని 3నెలల క్రితం సీఎం వైఎస్ జగన్ ఆరోపించిన నేపథ్యంలో ఈ ముగ్గురు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఏపీ ఎన్నికల సంఘానికి సంబంధించిన ఇష్యూ సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో హోటల్‌లో జరిగిన భేటీ వ్యవహారం ఏవిధమైన మలుపులు తిరుగుతుందనేది చూడాల్సిన అంశం.