ముఖేష్ అంబానీని లేపేయడానికి భారీ స్కెచ్ వేసిన ఇంట్లో పనివాళ్లు

దిశ,వెబ్‌డెస్క్: ఇండియన్ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీని హతమార్చేందుకు ఇంట్లో పనివాళ్లు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ముంబైతో పాటూ దేశంలోనే అత్యంత ఖరీదైన ముకేష్ అంబానీ ఇల్లు ఆంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఎస్‌యూవీ వాహనాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్‌యూవీ వెహికల్ ను చెక్ చేశారు. బాంబ్ స్క్వాడ్ జరిపిన సోదాల్లో 20 జిలిటెన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే కేసు […]

Update: 2021-02-25 10:48 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఇండియన్ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీని హతమార్చేందుకు ఇంట్లో పనివాళ్లు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ముంబైతో పాటూ దేశంలోనే అత్యంత ఖరీదైన ముకేష్ అంబానీ ఇల్లు ఆంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఎస్‌యూవీ వాహనాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్‌యూవీ వెహికల్ ను చెక్ చేశారు. బాంబ్ స్క్వాడ్ జరిపిన సోదాల్లో 20 జిలిటెన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసు అధికారులు దిమ్మతిరిగే వాస్తవాల్ని వెలుగు చూసినట్లు తెలుస్తోంది. ఎస్‌యూవీ వాహనం ఎవరిది? రిజిస్ట్రేషన్ ఎవరు చేయించారు? ఉగ్రవాదులా లేదంటే ఇంకెవరైనా ముఖేష్ శత్రువులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు స్కెచ్ వేశారా అనే కోణంలో స్థానిక పరిసరాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో ఎస్ యూవీ వాహనానికి సంబంధించి కొన్ని ఆధారాల్ని గుర్తించారు. ఆకుపచ్చరంగులో ఉన్న ఎస్‌యూవీ అంబానీ భద్రతా సిబ్బందిలోని వాహనంగా అనుమానిస్తున్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ తో పాటూ ఇతర వివరాలు మ్యాచ్ అవ్వడంతో మహరాష్ట్ర పోలీసులు ముఖేష్ అంబానీకి భారీ ఎత్తున సెక్యూరిటీని పెంచినట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు.

Tags:    

Similar News