అత్తగారింట్లో అల్లుడి అమానుషం.. రాత్రి భార్యతో అలా ప్రవర్తించి, తెల్లారే సరికి..
దిశ, మేళ్లచెరువు : వివాహిత అనుమానస్పద స్థితిలో మృతిచెందడం మేళ్లచెరువు మండలంలో కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో భార్యభర్తలకు గొడవ జరగడం.. ఉదయం ఆ ఇద్దరే ఇంట్లో ఉండటం.. ఆ తర్వాత భార్య అనుమానస్పదంగా మృతి చెందడంపై బంధువులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేళ్లచెరువు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మృతురాలి కుటుంబీకులు, పోలీసులు కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మేళ్లచెరువు గ్రామానికి చెందిన యర్రం పెద్ద సైదులు (లేట్), […]
దిశ, మేళ్లచెరువు : వివాహిత అనుమానస్పద స్థితిలో మృతిచెందడం మేళ్లచెరువు మండలంలో కలకలం సృష్టించింది. రాత్రి సమయంలో భార్యభర్తలకు గొడవ జరగడం.. ఉదయం ఆ ఇద్దరే ఇంట్లో ఉండటం.. ఆ తర్వాత భార్య అనుమానస్పదంగా మృతి చెందడంపై బంధువులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేళ్లచెరువు మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మృతురాలి కుటుంబీకులు, పోలీసులు కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.
మేళ్లచెరువు గ్రామానికి చెందిన యర్రం పెద్ద సైదులు (లేట్), తిరుపతమ్మ కుమార్తె ఏసు రాణిని కొన్నాళ్ల క్రితం జగ్గయ్యపేటకు చెందిన కుమ్మరి శ్రీనుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తొలినాళ్లు సజావుగా సాగిన వీరి సంసారంలో గత కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఏసురాణి మేళ్లచెరువులోని పుట్టింటికి వచ్చి ఉంటుంది. లారీ డ్రైవర్‌గా పని చేసి భర్త శ్రీను జగ్గయ్యపేటలోనే ఓ ట్రాన్స్ పోర్ట్‌లో డ్రైవర్‌గా పని చేస్తూ తరచూ భార్య దగ్గరకు వచ్చిపోతుండేవాడు. అయితే శనివారం రాత్రి అత్తగారింటికి వచ్చిన శీను.. భార్యతో గొడవపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం అత్త తిరుపతమ్మ చర్చికి వెళ్లగా ఆ సమయంలో భార్యను హత్య చేసి ఆత్మహత్యగా మార్చేందుకు ఉరి వేసుకున్నట్లుగా చిత్రీకరించినట్లు బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. తల్లి తిరుపతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీంద్ర తెలిపారు.
భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు : సృజన
భర్త శీనే రాణిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, అతనికి ఉన్న రాజకీయ పలుకుబడితో కేసును కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్లు మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన ఆరోపించారు. ఈ హత్యలో శ్రీను బంధువులకు కూడా సంబంధం ఉందని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మృతురాలి బంధువులతో కలిసి రోడ్డుపై బైఠాయించి సుమారు గంటకు పైగా ధర్నా చేపట్టారు. అయితే స్థానిక ఎస్సై రవీంద్ర వచ్చి వారికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.