అనుమానాస్పదంగా యువకుడి మృతి..!

దిశ, పటాన్‌చెరు: అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని సెక్యురిటీ గార్డు మృతి చెందిన ఘటన అమీన్‎పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా గండిగూడెంలోని అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో అమిత్ కుమార్ మిశ్రా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అదివారం పరిశ్రమ ఆవరణలో అమిత్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు తన కొడుకుది హత్యేనని పరిశ్రమ ఆవరణలో ఆందోళనకు దిగారు. తన కొడుకు మరణంపై సమగ్ర విచారణ జరిపి […]

Update: 2020-09-20 10:54 GMT
అనుమానాస్పదంగా యువకుడి మృతి..!
  • whatsapp icon

దిశ, పటాన్‌చెరు: అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని సెక్యురిటీ గార్డు మృతి చెందిన ఘటన అమీన్‎పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా గండిగూడెంలోని అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో అమిత్ కుమార్ మిశ్రా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అదివారం పరిశ్రమ ఆవరణలో అమిత్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు తన కొడుకుది హత్యేనని పరిశ్రమ ఆవరణలో ఆందోళనకు దిగారు. తన కొడుకు మరణంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మురళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News