నలుగురు ఆత్మహత్యా?.. హత్యా?
దిశ, కీసర: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్ రేణిగుంట గ్రామానికి చెందిన భిక్షపతి(36), ఉష(28) దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కీసర పరిధిలోని నాగారం-వెస్ట్ గాంధీనగర్ వచ్చారు. భిక్షపతి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె హర్షిణి(11), […]
దిశ, కీసర: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్ రేణిగుంట గ్రామానికి చెందిన భిక్షపతి(36), ఉష(28) దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం కీసర పరిధిలోని నాగారం-వెస్ట్ గాంధీనగర్ వచ్చారు. భిక్షపతి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె హర్షిణి(11), కుమారుడు(7) యశ్వంత్ ఉన్నారు. పక్కనే ఓ ఇంట్లో ఉన్న ఓ బాలిక పట్ల భిక్షపతి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని గురువారం రాత్రి భిక్షపతిపై అమ్మాయి కుటుంబ సభ్యులైన రమేష్, స్వప్న, కుమార్,బన్నీ,ప్రసాద్ రేణుకలతో పాటు వారి అనుచరులతో కలిసి భిక్షపతిపై దాడి చేశారు.
ఇదే విషయాన్ని స్థానికులు జోక్యం చేసుకుని శుక్రవారం ఉదయం పెద్దల సమక్షంలో మాట్లాడదామని చెప్పి వెళ్లిపోయారు. అవమానం భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి, తొలుత తన భార్య, పిల్లలకు ఉరివేసి చంపి మంచంపై పడుకోబెట్టి అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డారా? లేదా కక్షపురితంగా ఎవరైనా చంపేశారా? అనే పలు కోణాల్లో పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు సూసైడ్ నోటు కూడా రాసినట్లు, పిల్లల, ఉషా మెడ మీద బలమైన మరకలున్నట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనాస్థలికి చేరుకున్నారు. కీసర సీఐ నరేందర్‌గౌడ్ మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.