జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.. టీటీడీ కార్మికుల డిమాండ్

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం రాజకీయంగా దుమారం రేపుతుంది. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు గత ఆరు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. అయితే ఈ నిరసనలకు టీటీడీలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. దీంతో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. టీటీడీ సస్పెన్షన్ వేటు వేయడంపై టీటీడీ ఉద్యోగులు ఆగ్రహం […]

Update: 2021-12-03 05:02 GMT

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం రాజకీయంగా దుమారం రేపుతుంది. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు గత ఆరు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. అయితే ఈ నిరసనలకు టీటీడీలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. దీంతో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ముగ్గురు ఉద్యోగులపై వేటు వేసింది. టీటీడీ సస్పెన్షన్ వేటు వేయడంపై టీటీడీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తుంది.

గత ఆరు రోజులుగా నిరసనలు..

‘సీఎం జగన్ మీరు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. టైం స్కేల్ ఇస్తామని మాట ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండున్నరేళ్లు కావస్తుంది. ఇప్పటికీ తిరుమల కొండపై టీటీడీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇకనైనా తమను రెగ్యులరైజ్ చేయండి. ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీటీడీ కార్మికులు డిమాండ్ చేశారు. టీటీడీ కార్మికులను రెగ్యులరైజ్ చేయండి’ అంటూ టీటీడీ కార్మికులు టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆరు రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీకి భిన్నంగా టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో, పాలకమండలి పెద్దలు వ్యవహరిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కార్మికులు ఆరోపించారు.

చాలీచాలని జీతాలతో తమ జీవితాలు అగమ్య గోచరంగా మారాయని టీటీడీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ‌ కార్మికురాలు రాధా మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులను కాంట్రాక్టర్ల బారి నుంచి కాపాడాలని.. తమను కార్పొరేషన్‌లో కలపాలని డిమాండ్ చేశారు. సీఎం కార్మికుల సమస్యలపై జోక్యం చేసుకోవాలని కోరారు. తాను వ్యక్తిగతంగా సీఎం జగన్‌కు వీరాభిమానినని చెప్పుకొచ్చారు. తమ సమస్యలను సీఎం జగన్‌కు మెురపెట్టుకునేందుకు తాడేపల్లి సైతం వెళ్లామని అయితే కొవిడ్ కారణంతో అనుమతి ఇవ్వలేదని టీటీడీ కార్మికురాలు రాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను సీఎం జగన్‌ ఫోటోను చేతిపై టాటూగా వేసున్న విషయాన్ని అందరికీ చూపించారు.

ముగ్గురు ఉద్యోగులపై వేటు..

ఇదిలా ఉంటే కార్మికులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన ముగ్గురు ఉద్యోగులపై టీటీడీ వేటు వేసింది. టీటీడీ కార్మికుల ధర్నాకు మద్దతు పలికారని ఆరోపిస్తూ ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న నాగార్జున్, గుణశేఖర్, వేంకటేశంలను సస్పెండ్ చేసింది.

ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు అన్యాయం..

టీటీడీలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. తక్షణమే సస్పెన్షన్‌ను ఎత్తివేసి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్ కార్మికులను మూడు నెలల్లో రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ నేడు మాట తప్పారని.. తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేయడం తప్పా అని ప్రశ్నించారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యోగులకు మద్దతు తెలిపితే సస్పెండ్ చేస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News