మల్లన్నను పోలీసులు ఏం చేశారు.. ఆచూకీ తెలియకపోవడంతో ఫుల్ టెన్షన్

దిశ, తెలంగాణ బ్యూరో : చింతపండు నవీన్​ అలియాస్ తీన్మార్ ​మల్లన్నను వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆయన కుటుంబ సభ్యులు, పలువురు జర్నలిస్టులు డిమాండ్​ చేస్తున్నారు. మల్లన్నను శుక్రవారం రాత్రి ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేయడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి 11 గంటలకు అరెస్ట్ అంటూ హైదరాబాద్ ​సీపీ పీఆర్వో మెసేజ్ ఇచ్చారని వారు తెలిపారు. ఈ విషయంపై మల్లన్న న్యాయవాది ఉమేశ్​చంద్ర హైకోర్టులో హెబియస్ ​కార్పస్ పిటిషన్​దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. […]

Update: 2021-08-28 02:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : చింతపండు నవీన్​ అలియాస్ తీన్మార్ ​మల్లన్నను వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆయన కుటుంబ సభ్యులు, పలువురు జర్నలిస్టులు డిమాండ్​ చేస్తున్నారు. మల్లన్నను శుక్రవారం రాత్రి ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేయడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

రాత్రి 11 గంటలకు అరెస్ట్ అంటూ హైదరాబాద్ ​సీపీ పీఆర్వో మెసేజ్ ఇచ్చారని వారు తెలిపారు. ఈ విషయంపై మల్లన్న న్యాయవాది ఉమేశ్​చంద్ర హైకోర్టులో హెబియస్ ​కార్పస్ పిటిషన్​దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 10.30 గంటలకు హౌస్ మోషన్​పిటిషన్​ దాఖలు చేసి విచారణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News