ఓటీటీలోనే సూర్య చిత్రం..
లాక్‌డౌన్ వల్ల చాలా సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. చిన్న చిత్రాలనే కాదు, పెద్ద సినిమాలను కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేసేందుకు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే నాని, సుధీర్ బాబులు నటించిన ‘వి’ చిత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు సూర్య సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది. సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శూరరై పోట్రు’. తెలుగులో ఈ చిత్రం […]
లాక్‌డౌన్ వల్ల చాలా సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. చిన్న చిత్రాలనే కాదు, పెద్ద సినిమాలను కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేసేందుకు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే నాని, సుధీర్ బాబులు నటించిన ‘వి’ చిత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు సూర్య సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుంది.
సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శూరరై పోట్రు’. తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలవనుంది. కాగా, ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నట్లు హీరో సూర్య ప్రకటించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ లాక్డౌన్ వల్ల సాధ్యపడలేదు. ప్రస్తుతానికి థియేటర్స్ ఓపెనింగ్‌పై ఇంకా క్లారిటీ రాకపోయినా.. ఒకవేళ అవి తెరుచుకున్నా, ప్రేక్షకులు ఇప్పుడే థియేటర్‌కు వచ్చే అవకాశం కనపడట్లేదు. దీంతో చివరకు ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని అమెజాన్‌లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. అపర్ణ బాల మురళి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మోహన్‌బాబు, జాకిష్రాఫ్, పరేశ్ రావల్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.