ఆశ్చర్యం.. అకౌంట్లో డబ్బులేసింది ఎవరో తెలియదు.?
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ అకౌంట్లో మనకు తెలియకుండా డబ్బులు జమ అవుతాయని ఎవరూ ఊహించరు. ప్రభుత్వ పథకాలు, నష్టపరిహారాలకు సంబంధించిన డబ్బుల కోసం అయితే లబ్ధిదారులు వేయి కండ్లతో ఎదురుచూస్తుంటారు. మరికొందరు గూగుల్ పే నుంచి అమౌంట్ సెండ్ చేసినప్పుడల్లా స్క్రాచ్ కార్డు ద్వారా రూ. 5 నుంచి రూ.100 వరకు వస్తేనే ఎంతో లోలోపల మురిసిపోతుంటారు. ఇది సర్వ సాధారణ విషయమే. కానీ, ఓ గ్రామ ప్రజల అకౌంట్లో వేలకు వేల డబ్బులు జమ అవుతున్నాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ అకౌంట్లో మనకు తెలియకుండా డబ్బులు జమ అవుతాయని ఎవరూ ఊహించరు. ప్రభుత్వ పథకాలు, నష్టపరిహారాలకు సంబంధించిన డబ్బుల కోసం అయితే లబ్ధిదారులు వేయి కండ్లతో ఎదురుచూస్తుంటారు. మరికొందరు గూగుల్ పే నుంచి అమౌంట్ సెండ్ చేసినప్పుడల్లా స్క్రాచ్ కార్డు ద్వారా రూ. 5 నుంచి రూ.100 వరకు వస్తేనే ఎంతో లోలోపల మురిసిపోతుంటారు. ఇది సర్వ సాధారణ విషయమే. కానీ, ఓ గ్రామ ప్రజల అకౌంట్లో వేలకు వేల డబ్బులు జమ అవుతున్నాయి. ఎవరేస్తున్నారో తెలియదు.. ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు.. దీనిపై బ్యాంక్ అధికారులను అడిగినా సరైన సమాధానం లేదు. ఈ వ్యవహారం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.
ఇంతకీ ఈ ఘటన ఎక్కడో బయటి దేశంలో జరగలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత విజయనగరం జిల్లాలోనే వెలుగుచూసింది. శివరంపురంలోని దాదాపు 200 మంది ఖాతాల్లో నగదు జమ అయింది. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ. 13,500 జమకావడం ఆశ్చర్యకరం. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అధికారులు సైతం స్పష్టత ఇవ్వకపోవడంతో జనాల సందేహాలు మరింతగా పెరిగాయి. కాగా, ఓవైపు నగదు పడ్డాయన్న సంతోషంలో ఖాతాదారులు ఉన్నప్పటికీ.. వాటిని ఖర్చు చేయాలా వద్ద అన్న డైలమాలో కూడా పడ్డారు.