ప్రకాశంలో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్..
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాం సర్పంచ్ అభ్యర్ది ఏల్లవుళ తిరుపతి రావు శనివారం కిడ్నాప్‌కు గురవడం కలకలం రేపింది. సర్పంచ్ అభ్యర్థి తిరుపతి రావు టీడీపీ మద్దతుదారుడని ప్రాథమిక సమాచారం. ఉదయం కారులో టెంపుల్‌కు వెళ్లి వస్తుండగా ప్రత్యర్దులు కిడ్నాప్ చేసి ఒంగోలుకు తరలించినట్లు అతని మద్దుతుదారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాం సర్పంచ్ అభ్యర్ది ఏల్లవుళ తిరుపతి రావు శనివారం కిడ్నాప్‌కు గురవడం కలకలం రేపింది.
సర్పంచ్ అభ్యర్థి తిరుపతి రావు టీడీపీ మద్దతుదారుడని ప్రాథమిక సమాచారం. ఉదయం కారులో టెంపుల్‌కు వెళ్లి వస్తుండగా ప్రత్యర్దులు కిడ్నాప్ చేసి ఒంగోలుకు తరలించినట్లు అతని మద్దుతుదారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.