మార్కులే లైఫ్లో ఇంపార్టెంట్ కాదు : సూర్య
దిశ, సినిమా : మార్కులు, పరీక్షలు మాత్రమే జీవితంలో గెలుపుకు కారణమవుతాయనే అభిప్రాయం తప్పు అన్నారు హీరో సూర్య. నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తాయనే భయంతో సూసైడ్ చేసుకోవడం సరైంది కాదన్నారు. అలాంటి ఆత్మహత్యా ప్రయత్నం ఆపేయాలని విద్యార్థులను అభ్యర్థించారు. కేవలం మార్కులే లైఫ్లో ఇంపార్టెంట్ కాదన్న సూర్య.. సాధించేందుకు, మనని మనం ప్రూవ్ చేసుకునేందుకు చాలా విషయాలున్నాయని వివరించాడు. ధైర్యంగా, నమ్మకంగా ముందుకు సాగాలన్న సూర్య.. ‘మిమ్మల్ని ప్రేమించే, అర్థం చేసుకునేవారు ఇక్కడ […]
దిశ, సినిమా : మార్కులు, పరీక్షలు మాత్రమే జీవితంలో గెలుపుకు కారణమవుతాయనే అభిప్రాయం తప్పు అన్నారు హీరో సూర్య. నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తాయనే భయంతో సూసైడ్ చేసుకోవడం సరైంది కాదన్నారు. అలాంటి ఆత్మహత్యా ప్రయత్నం ఆపేయాలని విద్యార్థులను అభ్యర్థించారు. కేవలం మార్కులే లైఫ్లో ఇంపార్టెంట్ కాదన్న సూర్య.. సాధించేందుకు, మనని మనం ప్రూవ్ చేసుకునేందుకు చాలా విషయాలున్నాయని వివరించాడు. ధైర్యంగా, నమ్మకంగా ముందుకు సాగాలన్న సూర్య.. ‘మిమ్మల్ని ప్రేమించే, అర్థం చేసుకునేవారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. బిగ్గెస్ట్ విక్టరీ పొందగలరు. భయపడకండి’ అని సూచించాడు. బాధ, కష్టాలు త్వరలో తొలిగిపోతాయన్న ఆయన.. ‘జీవితాన్ని ముగించడమంటే మీ తల్లిదండ్రులకు, మిమ్మల్ని ప్రేమించే వారికి వేసే జీవితకాలపు శిక్ష’ అని తెలిపారు.
என் தம்பி தங்கைகளுக்கு…
அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே… pic.twitter.com/jFOK9qxqyN— Suriya Sivakumar (@Suriya_offl) September 18, 2021