ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో మరోసారి చుక్కెదురు
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సమర్ధించింది సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టులో విచారణ సరిగానే జరుగుతోందన్నారు. ఈ కేసు విచారణను హైకోర్టు త్వరగా ముగించాలని ఆదేశించింది. కాగా, రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తయ్యేవరకు […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సమర్ధించింది సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టులో విచారణ సరిగానే జరుగుతోందన్నారు. ఈ కేసు విచారణను హైకోర్టు త్వరగా ముగించాలని ఆదేశించింది.
కాగా, రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తయ్యేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.