ఏపీ మున్సిపోల్స్: పిటిషన్ కొట్టేసిన సుప్రీం

దిశ వెబ్‌డెస్క్: ఏపీ మున్సిపల్ ఎన్నికలపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ను ఇవ్వాలంటూ కడప జిల్లాకు చెందిన కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, దానిని రద్దు చేయడం కుదరదని తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికల నిర్వహణ […]

Update: 2021-03-09 02:02 GMT

దిశ వెబ్‌డెస్క్: ఏపీ మున్సిపల్ ఎన్నికలపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ను ఇవ్వాలంటూ కడప జిల్లాకు చెందిన కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, దానిని రద్దు చేయడం కుదరదని తెలిపింది.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికల నిర్వహణ ఎన్నికల కమిషన్ హక్కు అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ముందుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తిరస్కరించడంతో పిటిషనర్లు సుప్రీంలో సవాల్ చేశారు. కాగా బుధవారం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News