దేశద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్ : దేశ ద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 124 ఎ చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బ్రిటీష్ కాలంనాటి ఈ చట్టం అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఈ చట్టంతో పనేంటి అని నిలదీసింది. గాంధీ, బాలగంగాధర్ తిలక్‌లపై బ్రిటీష్ వారు ప్రయోగించిన చట్టం ఇంకా అవసరమా అని ప్రశ్నించింది. […]

Update: 2021-07-15 01:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశ ద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 124 ఎ చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బ్రిటీష్ కాలంనాటి ఈ చట్టం అవసరమా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఈ చట్టంతో పనేంటి అని నిలదీసింది. గాంధీ, బాలగంగాధర్ తిలక్‌లపై బ్రిటీష్ వారు ప్రయోగించిన చట్టం ఇంకా అవసరమా అని ప్రశ్నించింది. వ్యక్తులు, వ్యవస్థ స్వేచ్ఛను దేశద్రోహం చట్టం అడ్డుకోవడం లేదా, ఐపీసీ సెక్షన్ 124 దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సెక్షన్ 124ఎ చట్టం రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రాన్ని ప్రశ్నించింది. అలాగే పేకాట ఆడేవారిపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని, బెయిల్ రాకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. అధికార దాహంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, త్వరలోనే 124ఎ పై దాఖలైన అన్ని కేసులు ఒకే సారి విచారిస్తామంది. దేశ ద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News