ఈసీ నిర్ణయమే ఫైనల్: సుప్రీంకోర్టు!
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు సర్వోన్నత న్యాయస్థానం ఫుల్‌స్టాప్ పెట్టింది. సీఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ఉత్కంఠను సుప్రీంకోర్టు తీసేసింది. సీఈసీ నిర్ణయాన్ని కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం రిట్ దాఖలు చేస్తే, సరైన నిర్ణయం తీసుకున్నామంటూ సీఈసీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన న్యాయస్థానం తుదితీర్పును వెలువరించి వివాదాన్ని కొలిక్కి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. […]
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా నెలకొన్న ప్రతిష్ఠంభనకు సర్వోన్నత న్యాయస్థానం ఫుల్‌స్టాప్ పెట్టింది. సీఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ఉత్కంఠను సుప్రీంకోర్టు తీసేసింది. సీఈసీ నిర్ణయాన్ని కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం రిట్ దాఖలు చేస్తే, సరైన నిర్ణయం తీసుకున్నామంటూ సీఈసీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన న్యాయస్థానం తుదితీర్పును వెలువరించి వివాదాన్ని కొలిక్కి తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సీఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఎన్నికల నిర్వహణలో సీఈసీదే సంపూర్ణ అధికారమని తేల్చిచెప్పింది. ఎన్నికలు ఎప్పుడు నిర్ణయించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇష్టమేనని పేర్కొంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సుప్రీంకోర్టు రద్దు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆరువారాలు వాయిదా పడినట్టే. ఎన్నికల కోడ్ ఎత్తివేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఉన్న అడ్డంకి తొలగినట్టైంది. దీంతో ఉగాదికి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన పేదలకు పట్టాల పంపణీ యధావిధిగా జరుగనున్నట్టు తెలుస్తోంది. కోర్టు నిర్ణయంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి ముగింపు పలికినట్టైంది.
Tags: supreme court, ap government, state election commission,