ఆ రంగులు మార్చకపోతే చర్యలు: సుప్రీంకోర్టు
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైఎస్సార్సీపీ రంగులను సూచించేలా పంచాయతీ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ ఆఫీసులకు వేసిన రంగులను తొలగించాలంటూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా మరో రంగును జోడించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు తాము వేసింది పార్టీ రంగు కాదని వివరించింది. దానిని తిరస్కరించిన హైకోర్టు రంగులు తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పును రాష్ట్ర […]
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైఎస్సార్సీపీ రంగులను సూచించేలా పంచాయతీ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ ఆఫీసులకు వేసిన రంగులను తొలగించాలంటూ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా మరో రంగును జోడించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు తాము వేసింది పార్టీ రంగు కాదని వివరించింది. దానిని తిరస్కరించిన హైకోర్టు రంగులు తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, నాలుగు వారాల్లోగా రంగులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేస్తూ, ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది.