సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు ఊరట

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబర్ 1న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. ఏపీ హైకోర్టు జడ్జి ఎందుకు అన్నారో అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యవస్థ ఏమీ కుప్పకూలలేదు కదా అని ప్రశ్నించింది. […]

Update: 2020-12-18 03:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబర్ 1న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. ఏపీ హైకోర్టు జడ్జి ఎందుకు అన్నారో అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యవస్థ ఏమీ కుప్పకూలలేదు కదా అని ప్రశ్నించింది. తదుపరి విచారణ శీతాకాలం సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

Tags:    

Similar News