వీడియో కాన్ఫరెన్స్‌లో సుమోటో కేసు విచారణ
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కోర్టు హాల్లోకి జనం రాకుండా చూస్తోంది. అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్ ప్రకటించగానే సుప్రీంకోర్టు కూడా వర్చువల్ కోర్టు నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు సోమవారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ సుమోటో కేసును విచారించారు. ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్, నాగేశ్వరరావులు ఉన్నారు. హైకోర్టుల్లోనూ వర్చువల్ కోర్టుల ఏర్పాటుకు కావాల్సిన చర్యలను తీసుకోవాలని సీజే ఆదేశించారు. […]
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా కోర్టు హాల్లోకి జనం రాకుండా చూస్తోంది. అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్ ప్రకటించగానే సుప్రీంకోర్టు కూడా వర్చువల్ కోర్టు నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఈ మేరకు సోమవారం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ సుమోటో కేసును విచారించారు. ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్, నాగేశ్వరరావులు ఉన్నారు. హైకోర్టుల్లోనూ వర్చువల్ కోర్టుల ఏర్పాటుకు కావాల్సిన చర్యలను తీసుకోవాలని సీజే ఆదేశించారు. కేవలం లాక్‌డౌన్ సమయంలోనే కాదు, ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఈ-కోర్టులు ఏర్పాటు చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
వీడియోకాల్‌లో బెయిల్ వాదనలు
దిశ, నిజామాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులో ఓ వ్యక్తి బెయిల్ పిటిషన్‌పై సోమవారం వీడియో కాల్ ద్వారా నిజామాబాద్ సెషన్ కోర్టులో వాదనలు జరిగాయి. తొలుత కేసు వివరాలను ఈ-పైలింగ్ చేశారు. బెయిల్ పిటిషన్‌పై న్యాయవాదులు గొర్రెపాటి మాధవరావు, మాణిక్‌రాజ్‌లు ఇంటి వద్ద నుంచే వీడియో కాల్ ద్వారా వాదనలు వినిపించారు. ఎనిమిదో అదనపు జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి గోవర్ధన్‌రెడ్డి వీడియో కాల్ ద్వారా బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్నారు.