జగన్‌కి షాకిచ్చిన సుప్రీం

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్వీ రమణ పనిచేస్తున్నారని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలను సుప్రీం కొట్టివేసింది. ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ.. గత ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు జగన్ ఒక లేఖ రాశారు. ఈ లేఖపై అంతర్గత విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తాజాగా ఎన్వీ రమణపై జగన్ చేసిన ఆరోపణలను […]

Update: 2021-03-24 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్వీ రమణ పనిచేస్తున్నారని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పనిచేస్తున్నారంటూ జగన్ చేసిన ఆరోపణలను సుప్రీం కొట్టివేసింది. ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ.. గత ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు జగన్ ఒక లేఖ రాశారు.

ఈ లేఖపై అంతర్గత విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తాజాగా ఎన్వీ రమణపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించింది. జగన్ ఫిర్యాదుపై అంతర్గతంగా విచారణ చేపట్టామని, వివరాలను బయటికి బహిరంగపర్చలేమని వ్యాఖ్యానించింది.

కాగా, ఏప్రిల్ 23తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీకాలం ముగియనుంది. దీంతో తన తర్వాతి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణను నియమించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి బోబ్డే సూచించారు. సుప్రీంకోర్టులో బోబ్డే తర్వాత అత్యంత సీనియర్ న్యాయూర్తిగా ఎన్వీ రమణ ఉన్నారు.

Tags:    

Similar News