మేం విచారణ చేయం.. హైకోర్టుకు వెళ్లండి.. పరంబీర్ సింగ్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో సంచలనం రేపిన హోంమంత్రి వసూళ్ల ఆరోపణల కేసులో ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తాము విచారణ చేయబోమని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిని రాష్ట్ర హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించింది. ముఖేష్ అంబానీ ఇంటి ముందు బాంబు కేసులో అరెస్టైన మాజీ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేతో నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి కోరినట్టు పరంబీర్ సింగ్ ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐతో […]

Update: 2021-03-24 02:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో సంచలనం రేపిన హోంమంత్రి వసూళ్ల ఆరోపణల కేసులో ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తాము విచారణ చేయబోమని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిని రాష్ట్ర హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచించింది. ముఖేష్ అంబానీ ఇంటి ముందు బాంబు కేసులో అరెస్టైన మాజీ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజేతో నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి కోరినట్టు పరంబీర్ సింగ్ ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై స్పందించిన జస్టిస్ ఎస్‌కె కౌల్, ఆర్ సుభాష్ రెడ్డిల నేతృత్వంలోని ధర్మాసనం.. ‘పిటిషనర్ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశం సీరియస్ అనే విషయం మాకు కూడా తెలుసు. ఇది పరిపాలనను పెద్దగా ప్రభావితం కూడా చేస్తుంది. మీరు హైకోర్టును సంప్రదించండి..’ అంటూ తెలిపింది

Tags:    

Similar News