ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పటిలోగా విచారణ పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణ పూర్తి చేసేందుకు 6నెలల గడువు కోరింది. […]

Update: 2021-03-09 09:04 GMT

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎప్పటిలోగా విచారణ పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. విచారణ పూర్తి చేసేందుకు 6నెలల గడువు కోరింది. అన్ని డాక్యుమెంట్‌లు ఉన్నప్పుడు విచారణ లో ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించింది. రోజు వారీ విచారణ చేపట్టి ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 3కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News