మోడీకి క్లీన్ చిట్‌: పిటిషన్‌పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి స్పెషల్ ఇన్వెస్ట్‌గేషన్ టీమ్ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై దాఖలు చేసిన పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా పడింది. రెండు వారాల తర్వాత ఈ పిటిషన్‌ను విచారించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. 2002లో గుజరాత్‌లో జరిగిన మారణకాండ వెనుక అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ హస్తముందని ఆరోపిస్తూ దివంగత ఎంపీ ఇషాన్ జఫ్రీ భార్య జకియా జఫ్రీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2002లో ఫిబ్రవరి 28 న […]

Update: 2021-04-13 02:42 GMT

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి స్పెషల్ ఇన్వెస్ట్‌గేషన్ టీమ్ (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడంపై దాఖలు చేసిన పిటిషన్ విచారణ మళ్లీ వాయిదా పడింది. రెండు వారాల తర్వాత ఈ పిటిషన్‌ను విచారించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. 2002లో గుజరాత్‌లో జరిగిన మారణకాండ వెనుక అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ హస్తముందని ఆరోపిస్తూ దివంగత ఎంపీ ఇషాన్ జఫ్రీ భార్య జకియా జఫ్రీ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

2002లో ఫిబ్రవరి 28 న జరిగిన దారుణ మారణకాండలో ఇషాన్ జఫ్రీ కూడా హత్యకు గురయ్యాడు. అయితే పదేళ్ల పాటు విచారణలు ఎదుర్కొన్న ఈ కేసులో.. మోడీ పాత్ర ఏమీలేదని 2012 ఫిబ్రవరి 8న తెలిపిన సిట్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ జకియా జఫ్రీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ అల్లర్ల వెనుక ‘పెద్ద కుట్ర’ ఉన్నదని ఆమె ఆరోపించారు.

Tags:    

Similar News