ఏపీ పంచాయతీ ఎన్నికలపై మారిన సుప్రీం బెంచ్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు బెంచ్ మారింది. మొదట జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో ప్రభుత్వం పిటిషన్ వేయగా.. జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనానికి పిటిషిన్ బదిలీ అయ్యింది. సోమవారం సుప్రీంకోర్టు విచారణ జాబితాలో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటిషన్లు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు బెంచ్ మారింది. మొదట జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో ప్రభుత్వం పిటిషన్ వేయగా.. జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనానికి పిటిషిన్ బదిలీ అయ్యింది. సోమవారం సుప్రీంకోర్టు విచారణ జాబితాలో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటిషన్లు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రభుత్వ పిటిషన్ కంటే ముందే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఎస్ఈసీ.. విచారణలో తమ వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.