22 సార్లు రక్త దానం చేసిన శునకం.. ఎక్కడంటే ?

Jదిశ, ఫీచర్స్ : మనుషుల మాదిరిగానే, జంతువులకు కూడా రక్తం చాలా ముఖ్యం. మనకు బ్లడ్ అవసరమైతే, సంబంధిత గ్రూప్ వ్యక్తిని వెతుక్కుని వారినుంచి తీసుకుంటాం. కానీ, కుక్కలు, ఇతర జంతువులు అనారోగ్యం బారినపడితే.. వాటికి రక్తం ఎవరు దానం చేస్తారు? మనుషులు మనుషుల కోసం రక్తదానం చేసినప్పుడు, కుక్కలెందుకు కుక్కల కోసం చేయకూడదు? ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల పాటు బ్లడ్ డోనేట్ చేసి, ఎనబైకి పైగా శునకాలకు పునర్జన్మనిచ్చిన ఓ కుక్క.. మానవజాతికి సైతం ఆదర్శంగా […]

Update: 2021-08-31 10:23 GMT

Jదిశ, ఫీచర్స్ : మనుషుల మాదిరిగానే, జంతువులకు కూడా రక్తం చాలా ముఖ్యం. మనకు బ్లడ్ అవసరమైతే, సంబంధిత గ్రూప్ వ్యక్తిని వెతుక్కుని వారినుంచి తీసుకుంటాం. కానీ, కుక్కలు, ఇతర జంతువులు అనారోగ్యం బారినపడితే.. వాటికి రక్తం ఎవరు దానం చేస్తారు? మనుషులు మనుషుల కోసం రక్తదానం చేసినప్పుడు, కుక్కలెందుకు కుక్కల కోసం చేయకూడదు? ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల పాటు బ్లడ్ డోనేట్ చేసి, ఎనబైకి పైగా శునకాలకు పునర్జన్మనిచ్చిన ఓ కుక్క.. మానవజాతికి సైతం ఆదర్శంగా నిలిచింది.

లీసెస్టర్‌షైర్‌లో మెల్టన్ మోబ్రేలో గ్రేహౌండ్ జాతికి చెందిన ఈ డాగ్ పేరు వుడీ. ప్రస్తుతం 9ఏళ్ల వయసుండగా, మూడేళ్ల వయసు నుంచే దాదాపు ఆరేళ్లపాటు 22 సార్లు బ్లెడ్ డోనేట్ చేసింది. ఈ క్రమంలో మొత్తం 88 శునకాలను పునర్జన్మనిచ్చిన ఈ కుక్క ఇప్పుడు రిటైర్ అయింది. ఈ మేరకు 450 మిల్లీలీటర్ల రక్తం నాలుగు శునకాలను రక్షించడానికి సహాయపడుతుందని, యూకే పెట్ బ్లడ్ బ్యాంకు తెలుపుతూ, వుడీని సూపర్ స్టార్ అని ప్రశంసించింది. అలాగే ‘అనారోగ్యంతో దుఃఖంలో ఉన్న వాటికి ఈ శునకం సహాయం చేయడం అద్భుతమైన విషయం. ఈ గ్రే హౌండ్ల రక్తం సాధారణంగా నెగిటివ్ గ్రూపుకు చెందింది కావడంతో దీనికి డిమాండు ఎక్కువగా ఉంటుంది. వీటి రక్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఏ కుక్కకైనా ఇవ్వవచ్చు. కేవలం 30 శాతం శునకాలకే ఈ విధమైన రక్తం ఉంటుంది. అని లోబరోకి చెందిన స్వచ్చంద సంస్థ తెలిపింది.

‘వుడీ ఎప్పుడూ రక్తాన్ని సంతోషంగా ఇచ్చేది. రక్త దానం చేయడానికి వెళ్ళినప్పుడు గట్టిగా అరిచి, తనను కలవడానికి వచ్చిన వ్యక్తిని కలిసేందుకు పరుగు పెడుతూ వెళ్లేది. రక్తదానం చేస్తున్నంత సేపూ టేబుల్ మీద నిదానంగా పడుకుని ఉండేది. పూర్తయిన వెంటనే తనంతట తానే లేచేది. తనకు రక్త దానం చేయడం చాలా ఇష్టం. రక్త దానం చేసిన తర్వాత ప్రతికూల ప్రభావాలేవీ ఉండేవి కావు. అంతే కాకుండా, నాలుగు నుంచి 8 గంటల పాటు నడవడానికి కూడా సిద్ధంగా ఉండేది. అన్ని విషయాలనూ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. నాకు తనని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తోంది’ అని యజమాని ‘వెండీ గ్రే’ చెప్పారు.

Tags:    

Similar News