లెక్క తేలాల్సిందే : గాంధీ సూపరిటెండెంట్

       గాంధీ ఆస్పత్రిలోని పలు శాఖల్లో భారీగా స్కామ్ జరిగిందని డాక్టర్ జయంత్ చేసిన వ్యాఖ్యలపై సూపరిటెండెంట్ వైద్యులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. గాంధీలోని సెక్యూరిటీ,శానిటరీ,హౌజ్‌సర్జన్ డిపార్ట్మెంట్లలో భారీగా అవినీతి జరిగిందని జయంత్ చేసిన ప్రధాన ఆరోపణ. ఈ విషయంపై ప్రశ్నించినందుకే ఉన్నతాధికారులు తనను సస్పెండ్ చేశారని పేర్కొన్నాడు. గాంధీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి నిందితులను కఠింనంగా శిక్ష విధించాలని జయంత్ ప్రభుత్వాన్ని కోరారు.కాగా, గాంధీ ఆస్ప్రతిలో ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ […]

Update: 2020-02-13 01:45 GMT

గాంధీ ఆస్పత్రిలోని పలు శాఖల్లో భారీగా స్కామ్ జరిగిందని డాక్టర్ జయంత్ చేసిన వ్యాఖ్యలపై సూపరిటెండెంట్ వైద్యులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. గాంధీలోని సెక్యూరిటీ,శానిటరీ,హౌజ్‌సర్జన్ డిపార్ట్మెంట్లలో భారీగా అవినీతి జరిగిందని జయంత్ చేసిన ప్రధాన ఆరోపణ. ఈ విషయంపై ప్రశ్నించినందుకే ఉన్నతాధికారులు తనను సస్పెండ్ చేశారని పేర్కొన్నాడు. గాంధీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి నిందితులను కఠింనంగా శిక్ష విధించాలని జయంత్ ప్రభుత్వాన్ని కోరారు.కాగా, గాంధీ ఆస్ప్రతిలో ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ సోకిందని బయటకు లీకులు ఇచ్చాడన్న నెపంతోనే జయంత్‌పై చర్యలు తీసుకున్నట్టు గాంధీ సీనియర్ వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గాంధీ వైద్యులతో సూపరిటెండెంట్ సమావేశం నిర్వహించి జయంత్ వ్యాఖ్యలు వాస్తవమా లేదా అవాస్తవమా అని తేల్చేపనిలో ఉన్నారు.

Tags:    

Similar News