తెలంగాణలో త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్..!

దిశ, తెలంగాణ బ్యూరో: ఏడాదిన్నరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో టిమ్స్ తోపాటు నూతనంగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వారం రోజుల్లో జీఓను విడుదల చేయనున్నట్టుగా వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆసుపత్రుల నిర్మాణం, అందులోని సదుపాయాలు ఇతర అంశాలపై శుక్రవారం వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. పంజాగుట్ట ఆసుపత్రులో ఉన్నట్టుగా […]

Update: 2021-07-03 12:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏడాదిన్నరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో టిమ్స్ తోపాటు నూతనంగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వారం రోజుల్లో జీఓను విడుదల చేయనున్నట్టుగా వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆసుపత్రుల నిర్మాణం, అందులోని సదుపాయాలు ఇతర అంశాలపై శుక్రవారం వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. పంజాగుట్ట ఆసుపత్రులో ఉన్నట్టుగా 34రకాల విభాగాలను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఈ ఆసుపత్రుల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ సీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశీలనలు చేస్తున్నారు. మొదటగా 1200 పడకలతో ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. అనంతరం చెస్ట్ ఆసుపత్రి పరిధిలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. గడ్డి అన్నారం, అల్వాల్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో మరో రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News