ఉత్కంఠ మ్యాచ్‌లో.. హైదరాబాద్ విజయం

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. శుక్రవారం రాత్రి షేక్ జాయేద్ అబుదాబి స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి బ్యాట్‌మెన్‌లు కుప్పకూలారు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు నిర్ధేశించింది. దీనిని హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్ల […]

Update: 2020-11-06 12:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. శుక్రవారం రాత్రి షేక్ జాయేద్ అబుదాబి స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. హైదరాబాద్ బౌలర్ల ధాటికి బ్యాట్‌మెన్‌లు కుప్పకూలారు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు నిర్ధేశించింది. దీనిని హైదరాబాద్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 19.4 ఓవర్లో చేధించి విజయాన్ని సొంతం చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన నిర్దేశించిన 132 పరుగుల లక్ష్య ఛేదనలో హైదరాబాద్ జట్టు ఓపెనర్లు డెవిడ్ వార్నర్, శ్రీవాట్స్ గోస్వామి అనుకున్న స్థాయిలో రాణించలేదు. వార్నర్ 17, గోస్వామి 0, పరుగులే చేసి పెవిలియన్ బాటపట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు మనీశ్ పాండే క్రీజులో ఉన్నంత సేపు పరుగులు రాబట్టాడు. 21 బంతుల్లో 24 పరుగులు చేసి, మనీశ్ పాండే కూడా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వెంటనే యువ ఆటగాడు ప్రియమ్ గార్గ్(7) ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత బరిలోకి దిగిన వైస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, జేసన్ హోల్డర్ అద్భుతంగా రాణించారు. క్వాలిఫైయింగ్-2 మ్యాచులో హైదరాబాద్ బ్యాట్‌మెన్‌లు విజృంభించడంతో వార్నర్ సేన సులువుగా విజయాన్ని కైవసం చేసుకుంది. బెంగళూరు బౌలర్ల స్పీడుకు బ్రేకులు వేసి, నిలకడగా రాణించారు. బెంగుళూరు 132 పరుగుల లక్ష్యాన్ని నిర్ణీత 19.4 ఓవర్లలో 4 నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి, విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ 44 బంతుల్లో 50 పరుగులు చేయగా, జేసన్ హోల్డర్ 20 బంతుల్లో 24 పరుగులు చేశారు.

అబుదాబి వేదికగా జరిగిన కీలక క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో బెంగళూరు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కొహ్లీ సీజన్‌లోనే తొలిసారిగా ఓపెనర్‌గా బరిలోకి దిగి, ఆదిలోనే పెవిలియన్ చేరాడు. అనంతరం కోహ్లీతో ఓపెనర్‌గా వచ్చిన దేవ్‌దత్ ఫడిక్కల్‌ కూడా ఘోరంగా విఫలం అయ్యి ఒకే ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌గా వచ్చిన ఫించ్ రాణించాడు. మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 బంతుల్లో 32 పరుగులు చేసి, చెతులెత్తేశాడు.

ఇక ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో ఉండగా నాలుగో వికెట్‌గా బరిలోకి దిగిన ఏబీ డివిల్లియర్స్ మెల్లగా రాణిస్తూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. క్లిష్ట సమయంలో ఆఫ్ సెంచురీ చేసి, జట్టును ఆదుకున్నాడు. ఏబీతో కలిసి శివమ్ దూబే రాణిస్తున్నాడని ఆర్సీబీ అభిమానులు ఆనందపడేలోపే దూబే(8) వద్ద ఔటయ్యాడు. అనంతరం వచ్చిన వాషింగ్టన్ సుందర్(5) కే వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంటనే ఏబీ డివిల్లియర్స్ కూడా 56 పరుగుల వద్ద నాటరాజన్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత బరిలోకి దిగిన నవదీప్ శైనీ(09), మహమ్మద్ సిరాజ్(10)తో జతకలిసి జట్టు స్కోరును 131కు చేర్చారు. ప్రత్యర్థి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎదుట 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించారు.

స్కోరుబోర్డు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ 131-7 (20 ఓవర్లు)

1. విరాట్ కోహ్లీ 6(7) c సి.గోస్వామి b హోల్డర్
2. దేవదత్ ఫడిక్కల్ 1(6) c ప్రియామ్ గార్గ్ b హోల్డర్
3. ఆరోన్ ఫించ్ 30(32) c అబ్దుల్ సమద్ b నదీమ్
4. డివిలియర్స్ 56 (43) (wk) b టి నటరాజన్
5. మొయిన్‌ 0(1) రన్ అవుట్ (రషీద్ ఖాన్)
6. శివం డుబె 8 (13) c వార్నర్ b హోల్డర్
7. వాషింగ్టన్ సుందర్ 5(6) c అబ్దుల్ సమద్ b టి.నటరాజన్
8. నవదీప్ సైని 9(8) నాట్ అవుట్
9. సిరాజ్ 10(7) నాట్ అవుట్

ఎక్స్‌ట్రాలు: 4

మొత్తం స్కోరు: 131

వికెట్ల పతనం : 7-1 (విరాట్ కోహ్లీ, 1.2), 15-2 (దేవదత్ ఫడిక్కల్, 3.3), 56-3 (ఆరోన్ ఫించ్, 10.2), 62-4 (మొయిన్ అలీ, 10.4), 99-5 (శివం దూబే, 15.4), 111-6 (వాషింగ్టన్ సుందర్, 17.1), 113-7 (ఎబి డివిలియర్స్, 17.5)

బౌలింగ్:

సందీప్ శర్మ 4-0-21-0
జాసన్ హోల్డర్ 4-0-25-3
టి నటరాజన్ 4-0-33-2
షాబాజ్ నదీమ్ 4-0-30-1
రషీద్ ఖాన్ 4-0-22-0

సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 132- (19.4 ఓవర్లు)

డేవిడ్ వార్నర్ 17(17) c డివిలియర్స్ b రాజ్
శ్రీవాట్స్ గోస్వామి 0(3) (wk) c డివిలియర్స్ b సిరాజ్
మనీష్ పాండే 24(21) c డివిలియర్స్ b జాంపా
ప్రియామ్ గార్గ్ 7(14) c జాంపా బి b చాహల్
కేన్ విలియమ్సన్ 50(44) నాట్ అవుట్
జాసన్ హోల్డర్ 24(20) నాట్ అవుట్

ఎక్స్‌ట్రాలు: 10

మొత్తం స్కోరు: 132

వికెట్ల పతనం: 2-1 (శ్రీవాట్స్ గోస్వామి, 0.4), 43-2 (డేవిడ్ వార్నర్, 5.4), 55-3 (మనీష్ పాండే, 8.3), 67-4 (ప్రియామ్ గార్గ్, 11.5)

బౌలింగ్:

మహ్మద్ సిరాజ్ 4-0-28-2
నవదీప్ సైని 3.4-0-31-0
వాషింగ్టన్ సుందర్ 2-0-21-0
ఆడమ్ జాంపా 4-0-12-1
యుజ్వేంద్ర చాహల్ 4-0-24-1
మొయిన్ అలీ 1-0-4-0
శివం దుబే 1-0-7-0

Tags:    

Similar News