రైజర్స్ ముందు రైజింగ్ స్కోర్

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేశారు. నిర్ధిష్ఠం 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరగులు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ (6) పరుగులకే పెవిలియన్ చేరినా.. క్వింటెన్ డీకాక్ క్రీజులో నిలబడ్డాడు. కేవలం 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 67 పరుగులతో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చి సూర్యకుమార్ యాదవ్(27) పర్వాలేదనిపించి.. 48 పరుగుల వద్ద ఔట్ […]

Update: 2020-10-04 06:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేశారు. నిర్ధిష్ఠం 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరగులు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ (6) పరుగులకే పెవిలియన్ చేరినా.. క్వింటెన్ డీకాక్ క్రీజులో నిలబడ్డాడు. కేవలం 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 67 పరుగులతో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చి సూర్యకుమార్ యాదవ్(27) పర్వాలేదనిపించి.. 48 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.

ఇక మిడిలార్డర్‌లో వచ్చిన బ్యాట్స్‌మెన్లు ఇషాన్ కిషన్(31) హార్దిక్ పాండ్యా(28) తమవంతు కృషి చేసి పెవిలియన్ చేరారు. కీరన్ పొలార్డ్ (25), కృనాల్ పాండ్యా (20) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 208 పరుగులు చేసింది. ఇక 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ గెలుస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News